మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఫీమెల్ లీడ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నిర్మాతలు శనివారం (నవంబర్ 1) ఫీమేల్ మెయిన్ రోల్‌లో నటిస్తున్న జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్.. అచియ్యమ్మగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ శనివారం సినిమా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది.
ముఖ్యంగా, దేవర తర్వాత జాన్వీ కపూర్‌కి పెద్ది రెండవ తెలుగు చిత్రం. 'పెద్ది'ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌లపై సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. ఇది మార్చి 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది. జాన్వి చివరిసారిగా 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' చిత్రంలో కనిపించింది. ఇది అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా నటించారు.