అఫీషియ‌ల్ : సాహో ద‌ర్శ‌కుడితో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా

Pawan Kalyan's next film with director Sujeeth announced.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2022 2:15 PM IST
అఫీషియ‌ల్ : సాహో ద‌ర్శ‌కుడితో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. సాహో ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన‌ర్స్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 'పైర్ స్ట్రోమ్ ఇజ్ క‌మింగ్' అనే వ్యాఖ్య‌లు జోడించింది. ఎరుపు రంగుతో డిజైన్ చేసిన పోస్ట‌ర్‌పై' THEY CALL HIM #OG' అని రాసి ఉంది. అంతేకాకుండా పవన్‌ షాడో ఒక గన్‌ను చూపిస్తోంది. పోస్ట‌ర్‌ను బ‌ట్టి ఇది ఓ గ్యాంగ్ స్ట‌ర్ మూవీ అని అర్థం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ర‌వి.కె.చంద్ర‌న్ డీవోపీ అందించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ జాగ‌ర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌రిహ‌రవీర‌మ‌ల్లు' చిత్రంలో న‌టిస్తున్నాడు. శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. ఈ చిత్రంతో పాటు హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ 'అనే సినిమాలోనూ ప‌వ‌న్ న‌టిస్తున్నారు.

Next Story