పవన్, రానా మూవీకి అదిరిపోయే టైటిల్.. 'భీమ్లానాయ‌క్‌'

Pawan Kalyan Rana Daggubati movie title announcement.సినీ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Aug 2021 4:38 AM GMT
పవన్, రానా మూవీకి అదిరిపోయే టైటిల్.. భీమ్లానాయ‌క్‌

సినీ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న రోజు వ‌చ్చేసింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-ద‌గ్గుబాటి రానా మ‌ల్టీస్టార‌ర్‌గా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి ఎన్నో టైటిల్స్ నెటింట్లో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా.. వాటి అన్నింటికి చిత్ర బృందం పుల్‌స్టాఫ్ పెట్టేసింది. ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా చిత్ర‌బృందం టైటిల్‌ని ప్ర‌క‌టించేసింది.

ఈ చిత్రానికి 'భీమ్లా నాయక్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే 'భీమ్లా నాయక్'గా పవన్ కళ్యాణ్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసారు. దాంతో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. దీంతో సినీ అభిమానులు పుల్ జోష్‌లో ఉన్నారు.

పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, బీజుమేన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లుగా మ‌లయాళంలో సూప‌ర్ హిట్ అందుకున్న‌ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. బీజుమేన‌న్ పోషించిన పాత్ర‌ను ప‌వ‌ర్ స్టార్ చేస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రానికి త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త‌మ‌న్ స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story