సంక్రాంతి బరిలో పవన్-క్రిష్ సినిమా

Pawan Kalyan Krish film on Pongal.రీఎంట్రీ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోరు పెంచారు.ప‌వ‌న్‌-క్రిష్ కాంబినేష‌న్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2021 9:08 AM GMT
Pawan Kalyan Krish film on Pongal

రీఎంట్రీ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోరు పెంచారు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వ‌కుండా అటు రాజ‌కీయాలు, ఇటు సినిమా షూటింగ్‌లు బ్యాలెన్స్ చేస్తూ వ‌స్తున్నారు. రీ ఎంట్రీ ఇచ్చాక ప‌వ‌న్ న‌టించిన తొలి చిత్రం వ‌కీల్ సాబ్. ఈ మూవీని ఏప్రిల్ 9న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రానికి ఓటీటీ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో భారీ రేటుకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్లలో 50 రోజులు ఆడిన తర్వాతే ఓటీటీలో ప్రసారం చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తి కావడంతో మళయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమా తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్.

ఇదిలా ఉంటే.. ప‌వ‌న్‌-క్రిష్ కాంబినేష‌న్‌లో PSPK27గా ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. కీర‌వాణి సంగీతాన్ని అందిస్తుండ‌గా.. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై ఏఎం ర‌త్నం దీనిని నిర్మిస్తున్నారు. పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ వ‌జ్రాల దొంగ‌గా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహాశివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారు. కాగా..ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో పోటీ పడనుంది.


Next Story