హరి హర వీర మల్లు: పార్ట్ 1—స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాకి ఎట్టకేలకు క్రేజ్ కాస్త పెరిగినట్లు కనిపిస్తోంది. అమెరికాలో బుకింగ్స్ ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా జూలై 24న వస్తోంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. జూలై 11న విడుదలకు సిద్ధమైనప్పుడు అడ్వాన్స్ అమ్మకాలు అంత గొప్పగా లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రైలర్ విడుదలయ్యాక కాస్త అంచనాలు పెరిగాయి.
రాబోయే రోజుల్లో మరిన్ని లొకేషన్లు సినిమా విడుదలకు జోడించనున్నారు. దీంతో కలెక్షన్స్ పరంగా మరింత పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఇక చిత్ర యూనిట్ సినిమాను దూకుడుగా ప్రమోషన్‌లు కూడా చేయాలి.