చేయికోసుకుని స్ర్కీన్‌పై రక్తంతో పవన్ పేరు.. వీడియో వైరల్.. అనసూయ దిగ్భ్రాంతి
Pawan kalyan fan wrote name on screen with blood.సినీ నటులకు అభిమానులు ఉండడం సహజం. అయితే.. ఆ అభిమానం హద్దులు
By తోట వంశీ కుమార్ Published on 10 April 2021 3:45 PM ISTసినీ నటులకు అభిమానులు ఉండడం సహజం. అయితే.. ఆ అభిమానం హద్దులు దాటనంత వరకు బాగానే ఉంటుంది. అయితే.. కొందరు అభిమానం పేరుతో చేసే పనులు భయాందోళనకు గురిచేస్తాయి. తాజాగా ఓ అభిమాని చేసిన పని నెటీజన్లు కోపం తెచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. నిన్న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకెలుతోంది. ఈ చిత్రానికి విమర్శల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే.. ఇక పవన్ అంటే పూనకం వచ్చినట్లు ఊగే అభిమానులు చాలా మందే ఉంటారు.
చాలా కాలం తరువాత పవన్ సినిమా విడుదల అవుతుండడంతో వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎవరికి వాళ్లు థియేటర్ల దగ్గర చాలా హంగామా చేశారు. కొందరు పాలాభిషేకాలు చేయగా.. మరికొందరు కొబ్బరికాయలు కొట్టారు. అయితే.. ఓ అభిమాని హద్దులు దాటాడు. సినిమా ప్రసారం అవుతున్న సమయంలో ఆనందం తట్టుకోలేక ఓ అభిమాని తన చేతిని కోసుకొని తెరపై రక్తంతో పీఎస్‌పీకే(PSPK) అని రాసాడు. అక్కడున్న వాళ్లంతా ఈలల గోలలు చేయడంతో.. అతడు మరింత రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇలా తన కోసం చేతులు కోసుకునే లేదా కాల్చుకునే అభిమానాన్ని పవన్ కాదు ఏ హీరో కూడా హర్షించరని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఆ వ్యక్తి ఎవరనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఈ వీడియో పట్ల యాంకర్ అనసూయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చూడ్డానికి భీతిగొలిపేలా ఉందని వ్యాఖ్యానించారు. "ఇదేం అభిమానం... తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించరా? బాధ్యతగా వ్యవహరించాలి. అయినా అభిమానం ప్రదర్శించుకోవడానికి చాలా మార్గాలున్నాయి" అని హితవు పలికారు.