మ‌ళ్లీ ప్రేమలో పడిన రేణు దేశాయ్

Pawan kalyan ex wife Renu Desai again fall in love.ప్ర‌స్తుతం తాను ప్రేమ‌లో ప‌డిన‌ట్లు రేణుదేశాయ్ చెప్పారు తాను పెంచుకుంటున్న కుక్క పిల్ల తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2021 6:53 PM IST
Pawan kalyan ex wife Renu Desai again fall in love

రేణూ దేశాయ్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. వెండితెర‌కు దూర‌మైన సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులతో ఆమె ఎల్ల‌ప్పుడూ ట‌చ్‌లోనే ఉంటారు. తన రెండో పెళ్లి గురించి ప్రస్థావించి ఇదివరకూ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసినదే. వారు తమ అభిమాన హీరోకు మాజీ భార్య కావడం వల్ల రేణును ఆ కోణంలో చూడలేమని ఖరాకండిగా చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికలపై రేణు దేశాయ్ తన స్వేచ్ఛా భావాల్ని యథేచ్ఛగా ఆవిష్కరించడం సంచలనమే అయ్యింది.

రేణు ఆ ఘటనలో తన బాధను నిరభ్యంతరంగా వ్యక్తం చేశారు. తరువాత ఆమె రెండవ వివాహం గురించి మాట్లాడలేదు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం తాను ప్రేమ‌లో ప‌డిన‌ట్లు రేణుదేశాయ్ చెప్పారు. దాంతో అభిమానులు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. ప్లూటో అనే ప్రాణితో ప్రేమలో ఉన్నానని.. తాను పెంచుకుంటున్న కుక్క పిల్ల పేరు అది అని ఆశ్చర్యపరిచారు. ప్ర‌ముఖ న‌టి అక్కినేని అమ‌ల మాదిరిగానే రేణూ కూడా జంతు ప్రేమికురాల‌నే విష‌యం తెలిసిందే.




Next Story