'భీమ్లా నాయక్' బైక్ రైడ్… వీడియో వైరల్
Pawan Kalyan Bike ride in Bheemla Nayak shooting spot.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం
By తోట వంశీ కుమార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'భీమ్లా నాయక్' . సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర చివరి షెడ్యూల్ షూటింగ్ వికారాబాద్ లో ప్రారంభమైంది. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేయనున్నారు. దీంతో ఈ చిత్ర షూటింగ్ పార్టు పూర్తి అవుతుంది.
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ లో బైక్ రైడింగ్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఖాకీ యూనిఫామ్‌లో పవన్ కళ్యాణ్ బుల్లెట్ బైక్ పై అలా రోడ్డుపై వెళుతూ ఉన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. నిరంతరం భారీ స్థాయిలో సెక్యూరిటీతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత అలా స్వేచ్ఛగా బైక్ పై బయటకు వెళ్లినట్లు అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన అభిమానులు వన్ కళ్యాణ్ బైక్ రైడ్ మాములుగా లేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
👊⭐️🔥💕pic.twitter.com/tbNduyERPu
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 17, 2021
సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. వారం రోజుల షూటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్.. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రష్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.