ప‌వ‌న్ అభిమానుల‌కు పండ‌గే.. ఒకేసారి రెండు ఓటీటీలో భీమ్లానాయ‌క్‌

Pawan Kalyan Bheemla Nayak OTT Release Date Fix.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 11:36 AM IST
ప‌వ‌న్ అభిమానుల‌కు పండ‌గే.. ఒకేసారి రెండు ఓటీటీలో భీమ్లానాయ‌క్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'భీమ్లా నాయ‌క్‌'. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్ప‌టికి కొన్ని థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా భీమ్లా నాయ‌క్ న‌డుస్తుండ‌గా.. అప్పుడే ఓటీటీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఒకేసారి రెండు ఓటీటీల‌లో భీమ్లా నాయ‌క్ చిత్రం విడుద‌ల కానుంది.

మార్చి 25న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు ఆహా తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని రెండు సంస్థ‌లు త‌మ త‌మ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ద్వారా తెలియ‌జేశాయి. ఒకే రోజున రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ చేయడంతో భీమ్లా నాయక్ చిత్రానికి మంచి వ్యూవర్‌షిప్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఇక ఈ వార్తతో అభిమానులకు పండగ మొదలైంది. ఎప్పుడెప్పుడు మార్చి 25 వస్తుందా అని ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ చిత్రం విష‌యానికి వ‌స్తే.. మ‌ల‌యాళ చిత్రం 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్' రీమేక్‌గా తెర‌కెక్కింది. నిత్యామేన‌న్‌, సంయుక్త మేన‌న్ క‌థానాయిక‌లుగా న‌టించారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.


Next Story