'అన్‌స్టాపబుల్ 2'కు పవన్ ఆగయ
Pawan Kalyan and Trivikram Srinivas set to shoot for Unstoppable 2.బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న షో 'అన్‌స్టాపబుల్'.
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2022 12:40 PM ISTనందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న షో 'అన్‌స్టాపబుల్'. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. సీజన్ 1 విజయవంతం కావడంతో ఇటీవలే సీజన్‌ను 2ను ప్రారంభించారు. ఈ సీజన్ 2 కూడా అభిమానులను అలరిస్తోంది. ఇటీవల ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చారు. ప్రభాస్, గోపిచంద్‌లతో కలిసి బాలయ్య అల్లరి చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో ఇప్పటికే విడుదల కాగా.. డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. దీనిపై అటు పవన్ గానీ, ఇటు ఆహా సంస్థ గానీ స్పందించలేదు. అయితే.. నేడు పవన్ కళ్యాణ్ ఈ షోకి వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి టాక్ షోలకు రాని పవన్ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకి రావడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. పవన్ కళ్యాణ్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. మరి వాటికి పవన్ ఎలా సమాధానాలు చెబుతారోననే క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది.
.@PawanKalyan at #UnstoppableWithNBKS2 shoot. 🔥💥pic.twitter.com/pNiZQuod3s
— Trend PSPK (@TrendPSPK) December 27, 2022
కొద్ది సేపటి క్రితమే పవన్ కళ్యాణ్ అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్, క్రిష్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.