పవన్ కళ్యాణ్-రానా సినిమా టైటిల్ ఇదేనా..?

Pawan kalyan and Rana movie title Parasurama Krishnamurthy.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కీలక పాత్రల్లో ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 3:30 PM IST
పవన్ కళ్యాణ్-రానా సినిమా టైటిల్ ఇదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కీలక పాత్రల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..! ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ పూర్తవుతుందా..? ఇంకెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ రెడీ అవుతున్నారు. మలయాళం హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ గా సినిమా తెరకెక్కుతూ ఉంది. కరోనా ఉద్ధృతి కారణంగా షూటింగును ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండడంతో, ఈ నెల 11వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి టైటిల్ ఏమిటా అనే విషయాన్ని ఇంకా చిత్ర యూనిట్ చెప్పలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉండడంతో సినిమా టైటిల్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఓ టైటిల్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకి 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్ ను పెట్టబోతున్నారనే వార్తలు తాజాగా వైరల్ అయ్యాయి. మలయాళంలో కూడా క్యారెక్టర్ పేర్లనే టైటిల్ లో పెట్టగా.. తెలుగులో కూడా అదే తరహాలో సెట్ చేయాలని భావిస్తూ ఉన్నారు. అందుకే 'పరశురామ కృష్ణమూర్తి' యాప్ట్ టైటిల్ గా భావిస్తూ ఉన్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో, నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. టైటిల్ ను ఇదే ఉంచుతారా.. లేదా అన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే..!

Next Story