తిరుపతి లడ్డూ వివాదంపై పవన్‌ కల్యాణ్‌కు కార్తీ క్షమాపణలు.. స్పందించిన సూర్య

తిరుపతి లడ్డూ వివాదంలో అనవసరంగా తమిళ నటుడు కార్తీ పేరు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన సోదరుడు కార్తీ క్షమాపణలు చెప్పిన తర్వాత.. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు కార్తీ సోదరుడు, నటుడు సూర్య స్పందించారు.

By అంజి  Published on  25 Sept 2024 1:30 PM IST
Pawan Kalyan, Karthi, apology, Tirupathi laddu , Suriya

తిరుపతి లడ్డూ వివాదంపై పవన్‌ కల్యాణ్‌కు కార్తీ క్షమాపణలు.. స్పందించిన సూర్య

తిరుపతి లడ్డూ వివాదంలో అనవసరంగా తమిళ నటుడు కార్తీ పేరు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన సోదరుడు కార్తీ క్షమాపణలు చెప్పిన తర్వాత.. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు కార్తీ సోదరుడు, నటుడు సూర్య స్పందించారు. పవన్ కళ్యాణ్ కు సూర్య సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.కార్తీ సారీ చెప్పిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తూ మనం పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలిని అన్నారు. కార్తీ హీరోగా నటించిన సినిమా “సత్యం సుందరం” రిలీజ్ కి కార్తీకి అలాగే నిర్మాత, కార్తీ సోదరుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తన బెస్ట్ విషెస్ తెలిపారు.

ఈ పోస్ట్ కు కార్తీ రెస్పాండ్ అయ్యారు. పవన్ కి ధన్యవాదాలు తెలిపారు. సూర్య కూడా పవన్ పోస్ట్ కి రిప్లై ఇచ్చి థాంక్స్ చెప్పారు. సెప్టెంబర్ 23న, కార్తీ హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ కొన్ని మీమ్స్ చూపించారు. అందులో ఒకటి లడ్డూల గురించి. అదే విషయంపై కార్తీ స్పందిస్తూ, "ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు, ఇది సున్నితమైన అంశం. ఆ టాపిక్ వద్దు" అని అన్నారు.

కార్తీ నటించిన సత్యం సుందరం ఈ సెప్టెంబర్ 27న తమిళ్ లో రిలీజ్ కానుండగా తెలుగులో 28న రాబోతుంది.

Next Story