BRO: థియేటర్‌లో రెచ్చిపోయిన పవన్ ఫ్యాన్స్.. బీరు బాటిళ్లతో దాడి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో'.. ఈ నెల 28వ తేదీన రిలీజై భారీ విజయం సాధించింది.
By అంజి Published on 30 July 2023 10:29 AM IST
BRO: థియేటర్‌లో రెచ్చిపోయిన పవన్ ఫ్యాన్స్.. బీరు బాటిళ్లతో దాడి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో'.. ఈ నెల 28వ తేదీన రిలీజై భారీ విజయం సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో చేలరేగిపోతున్నారు. థియేటర్లలో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ అలంకార్ థియేటర్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. శనివారం నాడు సాయంత్రం బీర్ బాటిల్లతో థియేటర్‌లో మద్యం తాగుతూ సీసాలు పగిలిపొట్టి హాల్ చల్ చేశారు.
బీర్ బాటిల్‌తో పరస్పరం కొట్టుకోవడంతో పాటు గొడవను అదుపు చేయడానికి వచ్చిన థియేటర్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులకు థియేటర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. గొడవకు దిగిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు పవన్ ఫ్యాన్స్.. ఇలాంటి వాళ్ళ వల్లే పవన్ కి చెడ్డపేరు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మొన్న ఏపీలోని పార్వతీపురం సౌందర్య థియేటర్ లో అభిమానులు రచ్చరచ్చ చేశారు. సంబరంలో మునిగిపోయి ఏకంగా థియేటర్ లోని స్క్రీన్ నే చింపేశారు. దీంతో థియేటర్ యజమానులు సినిమాను నిలిపేశారు.
ఇదిలా ఉంటే.. పవన్ ఫ్యాన్స్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించిన ఈ సినిమా.. మొదటి రోజే ఎవరూ ఊహించని రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. థమన్ సంగీతం అందించారు.