పవన్-రానా మూవీ.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన చిత్ర బృందం
Pawan and Rana Movie making glimpse Video out.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో
By తోట వంశీ కుమార్ Published on
27 July 2021 11:32 AM GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కొషియుమ్' రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ పై పతాకంపై నిర్మితం అవుతున్న ఈచిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంబాషణలు అందిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడగా.. తాజాగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం షూటింగ్ విశేషాలతో కూడిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఈ చిత్రంలో బీమ్లా నాయక్ అనే పోలీస్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన మేకింగ్ గ్లింప్స్ వీడియో అభిమానులను అలరిస్తోంది. ఇందులో లొకేషన్ లో త్రివిక్రమ్ రానాతో చర్చిస్తుండటం, పోలీస్ అధికారి బీమ్లా నాయక్ గెటప్ లో ఉన్న పవన్ నడుచుకుంటూ వస్తున్న వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Next Story