బాలీవుడ్ బాద్ షా అంటే ఇట్లానే ఉంటాది.. 4 రోజుల్లో రూ.400 కోట్ల క‌లెక్ష‌న్స్‌..!

Pathaan is fastest Bollywood film to enter Rs 400-crore club worldwide.షారుక్ ఖాన్ న‌టించిన చిత్రం ప‌ఠాన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2023 1:02 PM IST
బాలీవుడ్ బాద్ షా అంటే ఇట్లానే ఉంటాది.. 4 రోజుల్లో రూ.400 కోట్ల క‌లెక్ష‌న్స్‌..!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ న‌టించిన చిత్రం 'ప‌ఠాన్‌'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో దీపిక పదుకొణె క‌థానాయిక‌గా న‌టించింది. జ‌న‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో అత్య‌ధిక వేగంగా రూ.400 క్ల‌బ్‌లో చేరిన బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించిందని ట్రేడ్‌ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు ఇక ఇండియాలోనూ రూ.200 కోట్ల పై చిలుకు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర జోరు చూస్తుంటే ఆదివారం కూడా హ‌వా కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీంతో తొలి వారంలోనే రూ.500 కోట్ల క్ల‌బ్‌లో చేరే అవ‌కాశం ఉంది.

జాన్ అబ్రహం ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించగా స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో మెరిశాడు. భారీ క్యాస్టింగ్ ఉండ‌డంతో రిలీజ్‌కి ముందే ప‌ఠాన్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు బేష‌ర‌మ్ రంగ్ పాట‌లో దీపికా ప‌దుకొణె ద‌రించిన బికినీ రంగుపై వివాదం చెల‌రేగ‌డంతో సినిమాకి దేశ వ్యాప్తంగా మంచి ప‌బ్లిసిటీ ల‌భించిన‌ట్లైంది. దీంతో తొలి రోజే రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి హిందీ చిత్ర చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ఓపెనింగ్స్ రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది.

Next Story