బాక్సాఫీసు వద్ద 'పఠాన్' కలెక్షన్స్ సునామీ

Pathaan Box Office Collection Day 5. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటాడు. అతి తక్కువ సమయంలో

By M.S.R  Published on  30 Jan 2023 8:45 PM IST
బాక్సాఫీసు వద్ద పఠాన్ కలెక్షన్స్ సునామీ

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటాడు. అతి తక్కువ సమయంలో పఠాన్‌ మూవీ రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకుంది. భారత్ లో రూ.335 కోట్లు రాబట్టగా ఓవర్సీస్‌లో రూ.207 కోట్లు కొల్లగొట్టింది. పఠాన్‌ ఐదు రోజుల్లోనే రూ.542 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో షారుక్‌ సరసన హీరోయిన్‌ దీపికా పదుకొణె నటించింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ కి పూర్వవైభవం తీసుకొచ్చింది పఠాన్ మూవీ అని షారుఖ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఒకే రోజు బాలీవుడ్‌లో 70 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక సినిమా ఇదే. ఇంతవరకు ఏ సినిమా కూడా కనీసం 55 కోట్ల మార్కును కూడా దాటలేదు. ఐదో రోజు కూడా 60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఈ సినిమాకు 260 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. భారత్ లో 5500 థియేటర్లలో పఠాన్ రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో 2500 స్క్రీన్ లలో విడుదలైంది. మొత్తంగా చూస్తే 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు. షారుఖ్ ఖాన్ కు విదేశాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమాకు మొదటి నుండి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా ఉన్నాయి.


Next Story