ఎస్ఎస్ రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించింది. ఈ సంవత్సరం ఈ రెండు భాగాలను కలిపి థియేటర్లలో 'బాహుబలి: ది ఎపిక్' అంటూ విడుదల చేశారు. ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. బాహుబలి 1, బాహుబలి 2 లను కలిపి 3 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌తో బాహుబలి: ది ఎపిక్ అనే ఒకే చిత్రంగా విడుదల చేశారు. రీ-రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది. 50 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అతిపెద్ద రీ-రిలీజ్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని భారతీయ భాషలలో అందుబాటులో రానుంది.