విక్కీ-క్యాట్ వివాహం.. రూ.100కోట్లను ఆఫర్ చేసిన ఓటీటీ..!
OTT platform offers Rs 100 crore for Katrina Kaif Vicky Kaushal wedding footage.సినీ పరిశ్రమలో నటీ, నటులు చేసుకునే
By తోట వంశీ కుమార్ Published on 7 Dec 2021 5:30 AM GMTసినీ పరిశ్రమలో నటీ, నటులు చేసుకునే పెళ్లిళ్లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా స్టార్ హీరో, హీరోయిన్లు వివాహాం చేసుకునేప్పుడు వీటిని క్యాష్ చేసుకునేందుకు కొన్ని సంస్థలు పోటి పడుతుంటాయి. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోల హక్కులను కొనుగోలు చేసేందుకు చాలా సంస్థలు ముందుకువస్తుంటాయి. ఇక ప్రస్తుతం కత్రినా కైఫ్ – విక్క కౌశల్ పెళ్లికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్ సవాయ్ వాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్‌లో వేద పండితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరగనుంది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహ వేడుక సింపుల్ గా జరగనుంది. మొత్తంగా ఈ పెళ్లి కి 200 మంది వరకూ హాజరవుతున్నారు. బాలీవుడ్ నుంచి చాలా ముఖ్యమైన వారిని మాత్రమే విక్కీ-క్యాట్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వీరి పెళ్లివేడుకకు సంబంధించిన ఏర్పాట్ల పూర్తి అయ్యాయి. ఇక అతిథులకు కూడా పలు ఆంక్షలు పెట్టారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సెల్పీలను తీయవద్దని, అసలు సెల్‌ఫోన్లను లోపలికి తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇందుకు వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. కత్రినా కైఫ్- కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ కోసం ఒక బడా ఓటీటీ సంస్థ రూ.100కోట్ల ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. గతంలోనూ పలువురు సెలబ్రెటీలు తమ పెళ్లి పుటేజ్‌ల ప్రసారాల కోసం సినీ మ్యాగజైన్లు, ఫోటోగ్రాఫర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కత్రినా-విక్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఒకవేళ వారు ఈ ఆఫర్‌కు ఓకే చెబితే.. ఓ ఓటీటీ సంస్థ పెళ్లి వేడుక ప్రసారహక్కులను పొందడం ఇదే తొలిసారి అవుతుంది.