98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో తెలుగు దిగ్గజ నటుడు కోట శ్రీనివాస్ రావుకు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ వేదికగా నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. తెలుగు విలక్షణ నటుడిని అకాడమీ గుర్తుచేసుకుంటూ నివాళి జాబితాలో చేర్చింది. కోటశ్రీనివాసరావుతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈమేరకు నివాళులు అర్పిస్తూ ఓ వీడియోను స్టేజ్ పై ప్లే చేశారు.
దిగ్గజ నటుడు కోట శ్రీనివాస్ రావు ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కమెడియన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించారు. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ వేత్తగానూ కోట శ్రీనివాస్ రావు సత్తా చాటారు.