ఓటీటీలోకి శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'

Oke Oka Jeevitham locks OTT release date.ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురుచూసిన శర్వానంద్ కు ‘ఒకే ఒక జీవితం’ సినిమా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Oct 2022 7:00 PM IST
ఓటీటీలోకి శర్వానంద్ ఒకే ఒక జీవితం

ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురుచూసిన శర్వానంద్ కు 'ఒకే ఒక జీవితం' సినిమా ద్వారా మంచి హిట్ దక్కింది. టైమ్ మిషన్ తో కూడుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా తల్లి పాత్రలో అమల చేయడం కూడా సినిమాకు మంచి ప్లస్ గా మారింది. శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న విడుద‌లై మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్‌ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను అక్టోబర్‌ 10నుండి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌ ప్ర‌కాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story