అఖండ-2 ను అడ్డుకునే ప్రయత్నం
బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2 తాండవం' సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
By - Knakam Karthik |
అఖండ-2 ను అడ్డుకునే ప్రయత్నం
బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2 తాండవం' సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ చిత్రం విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ. 28 కోట్ల బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో మహేశ్ బాబు నటించిన '1 నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాల నిర్మాణ సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేశాయి. 'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని, కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోస్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. అయితే, ఈ వివాదం కోర్టు బయట సెటిల్‌మెంట్ ద్వారా త్వరగా పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.