'బింబిసార' మూవీపై ఎన్టీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

NTR Tweets about audience response to bimbisara. నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'బింబిసార' థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీపై హీరో ఎన్టీఆర్‌

By అంజి  Published on  5 Aug 2022 10:35 AM GMT
బింబిసార మూవీపై ఎన్టీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'బింబిసార' థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీపై హీరో ఎన్టీఆర్‌ ప్రశంసలు కురిపించారు. 'బింబిసార' రాజు పాత్రకు తన అన్న కల్యాణ్‌ రామ్‌ తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని ఎన్టీఆర్‌ అన్నారు. సినీ ప్రేక్షకుల నుంచి ఈ మూవీ వస్తోన్న స్పందనపై ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కల్యాణ్‌ రెండు విభిన్న లుక్స్‌లో కనిపించారు. సంయుక్తా మేనన్‌, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటించారు

'బింబిసార' మూవీని ఫస్ట్‌ టైమ్‌ చూసినప్పుడు తాము ఎలాంటి అనుభూతిని పొందామో.. ప్రేక్షకులు ఇప్పుడు అదే ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు. ''బింబిసార' మూవీ గురించి గొప్ప విషయాలు వింటున్నా.. కల్యాణ్‌ రామ్‌ అన్నా.. ఈ మూవీలో రాజుగా నున్ను ఎవరూ భర్తీ చేయలేరు. వశిష్ఠ.. మొదటి ప్రయత్నంలోనే సినిమాను అద్భుతంగా తెరకెక్కించావు. ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి గారే వెన్నెము. ఆయన అందించిన మ్యూజిక్‌ అద్భుతంగా ఉంది.'' అని చిత్రయూనిట్‌కు ఎన్టీఆర్‌ అభినందనలు తెలిపారు.Next Story
Share it