ఇట్స్ అఫీషియల్.. NTR-NEEL సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
By Knakam Karthik
బాక్సాఫీస్ విధ్వంసానికి సిద్ధం కండి..ఎన్టీఆర్, నీల్ మూవీపై మేకర్స్ అప్‌డేట్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్31'గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇద్దరు డైనిమిక్ వ్యక్తులు బాక్సాఫీస్ వద్ద సృష్టించే విధ్వంసాన్ని అనుభూతి చెందేందుకు సిద్ధం కండి. 2026 జూన్ 25న థియేటర్లు దద్దరిల్లనున్నాయి. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయనున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం అని పోస్టర్లో మేకర్స్ రాసుకొచ్చారు.
అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2026 జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కథ డిమాండ్, క్వాలిటీ ఔట్‌పుట్ కోసం రిలీజ్ ఆలస్యం కానుంది. ఇలా పలు కారణాల వల్ల విడుదల లేట్ అవ్వనుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్వాలిటీ విషయంలో రాజీ పడేదే లేదని నిర్ణయించుకున్నారు. అందుకే రిలీజ్ కాస్త లేటైనా, మంచి ఔట్‌పుట్ అందించేందుకే ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విడుదల ఆలస్యం అయినా, సినిమా అంచనాలు మించేలా ఉండాలని భావిస్తున్నారు.