రత్నవేలు పోస్టుతో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే!
“దేవర: పార్ట్ 1” చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా ఓపెనింగ్ సాంగ్ చేసే పనిలో ఉన్నాడు.
By అంజి Published on 12 Aug 2024 10:00 AM ISTరత్నవేలు పోస్టుతో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే!
“దేవర: పార్ట్ 1” చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా ఓపెనింగ్ సాంగ్ చేసే పనిలో ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పాటకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. ఈ పాట ఎన్టీఆర్ అభిమానులను మంచి ఊపు తెప్పించే సాంగ్ అంటూ గుడ్ న్యూస్ చెప్పారు రత్నవేలు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాటకు బాలీవుడ్ మాస్టర్ గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ గా ఉన్నారని తెలిపారు.
“Filming a kick ass opening song from @anirudhofficial #Devara with a raw visual style. What an electrifying movement with sheer grace n style @tarak9999 Fans will go berserk!,” అంటూ రత్నవేలు ట్వీట్ పెట్టారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన “దేవర: పార్ట్ 1” కోసం సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27, 2024న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. చిత్రీకరణ ఈ నెలాఖరులో ముగుస్తుంది. ఇటీవల విడుదలైన రెండవ సాంగ్ “చుట్టమల్లె” ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్ ను అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు. బహుళ భారతీయ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది ఈ సినిమా.
Filming a kick ass opening song from @anirudhofficial #Devara with a raw visual style.What an electrifying movement with sheer grace n style @tarak9999 🔥🔥Fans will go berserk ! @SivaKoratala @RathnaveluDop #Ganesh acharya master @sreekar_prasad @sabucyril @Yugandhart_… pic.twitter.com/BYr4mzyu8D
— Rathnavelu ISC (@RathnaveluDop) August 10, 2024