అక్కడ అప్పుడే మొదటి రోజు 20 కోట్లు కొల్లగొట్టిన దేవర!
ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Sept 2024 2:59 PM ISTఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తూ ఉంది. ఓవర్సీస్‌లో ట్రెండ్‌గా కొనసాగుతున్న ఈ సినిమా తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో 20 కోట్లను దాటేసింది. ఇంకా రిలీజ్ కు 5 రోజులు ఉండడంతో ఇంకో 10-20 కోట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక ప్రీమియర్ టాక్ ను బట్టి కలెక్షన్స్ భారీగా ఉండనున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ నుండి, దాదాపు 80% ఆదాయం అమెరికా నుండి మాత్రమే వస్తుంది. UK, ఆస్ట్రేలియా ఇతర ప్రదేశాలలో బుకింగ్‌లు కూడా చాలా బలమైన నోట్‌లో ట్రెండ్ అవుతోంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 50 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
'దేవర' సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్లపై రూ.135 వరకూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110.. లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్థరాత్రి 12AM నుంచి మొత్తం 6 షో లకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ల ధరల పెంపునకు అనుమతినిచ్చిన ప్రభుత్వానికి హీరో ఎన్టీఆర్, నిర్మాత కళ్యాణ్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు.