'దేవర' సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే.?
జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 తో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
By Medi Samrat Published on 25 Sep 2024 11:21 AM GMTజూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 తో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ మీద అంచనాలు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఈ సినిమా బుకింగ్‌లు భారీనా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 48 కోట్ల షేర్‌తో నాన్-ఆర్‌ఆర్‌ఆర్ ఓపెనింగ్ రికార్డ్‌ను సాలార్ కలిగి ఉంది. RRR 74 కోట్ల భారీ ఓపెనింగ్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. దేవర అడ్వాన్స్ బుకింగ్‌లు, మిడ్‌నైట్ షోలను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 50 కోట్ల షేర్‌తో సాలార్ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డును నెలకొల్పడంతో పాటు రూ.50 కోట్ల షేర్ మార్క్‌ను దాటే చిత్రంగా అంచనా వేస్తున్నారు. దేవర యొక్క థియేట్రికల్ రైట్స్ విలువ రూ. 120 కోట్లు కాగా, ప్రారంభ రోజున 40% రికవరీని అందుకునే అవకాశం ఉంది.
దేవర సినిమా OTT హక్కులను రికార్డు ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కొరటాల శివ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 8 వారాల తర్వాత మాత్రమే OTTలోని రానుంది. ఇది అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోనే భారీ పాన్ ఇండియా చిత్రాలతో సహా అనేక చిత్రాలు OTTలోకి వచ్చాయి. అయితే కల్కి 2898 AD సినిమా 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఎన్టీఆర్ దేవర సినిమా కూడా 8 వారాల విండోను ఎంచుకోనుంది.