క‌రోనా బారిన ప‌డిన బాలీవుడ్ న‌టి

Nora Fatehi tests Covid-19 positive.క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రోసారి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. టాలీవుడ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2021 5:20 AM GMT
క‌రోనా బారిన ప‌డిన బాలీవుడ్ న‌టి

క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రోసారి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా చాలా న‌టీన‌టులంద‌రూ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ కు చెందిన కరీనా కపూర్, అమృత అరోరాల‌తో పాటే బోని క‌పూర్ కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టి క‌రోనా బారిన ప‌డింది. బాహుబ‌లి బ్యూటీ నోరా ఫ‌తేహి కి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

దురదృష్టవశాత్తు తాను కరోనా బారిన పడ్డానని చెప్పింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల తాను తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు చెప్పుకొచ్చింది. 'గత కొద్ది రోజులుగా మంచానికే ప‌రిమితం అయ్యా. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నా. అంద‌రూ జాగ్ర‌త్తగా ఉండండి. మాస్కులు ధ‌రించండి'. అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని, ప్రతి ఒక్కరిని తాకే అవకాశం ఉందని, తాను అనుభవిస్తున్న బాధ ఎవరూ అనుభవించకూడదని చెప్పింది. ఆరోగ్యం కంటే మనకు ఏదీ ఎక్కువ కాదని చెప్పుకొచ్చింది.

నోరా కరోనా బారిన పడిందనే వార్తలతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోనా' అంటూ తొలిసారి టాలీవుడ్‌ ఆడియన్స్‌ను పలకరించిందీ. ఆ తర్వాత 'బాహుబలి' సినిమాలో 'మనోహరి' పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకుంది. 'కిక్‌2', 'షేర్‌' 'లోఫర్‌', 'ఊపిరి' సినిమాల్లోని పాటలకు ఆమె చేసిన డ్యాన్స్‌కు చాలా మంది ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Next Story
Share it