తనను తిడుతున్న వారికి సమాధానం చెప్పిన నివేదా థామస్

Nivetha Thomas About Rumours.నివేదా థామస్ కరోనా సోకడంతో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరు అవ్వలేదు. ఇక ఉన్నట్లుండి సినిమా థియేటర్ లో నివేదా థామస్ ప్రత్యక్షమైంది.

By Medi Samrat  Published on  12 April 2021 10:40 AM GMT
Nivetha Thomas

దేశంలో కరోనా ఉధృతి విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! కరోనా సోకిన, సోకుతున్న వారిలో పలువురు సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. నటి నివేదా థామస్ ను కూడా కరోనా మహమ్మారి వెంటాడింది. ఆమెకు కరోనా సోకడంతో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరు అవ్వలేదు. ఇక ఉన్నట్లుండి సినిమా థియేటర్ లో నివేదా థామస్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ మొద‌టి వారంలో నివేదా థామ‌స్‌కు క‌రోనా సోకడంతో ఆమె క్వారంటైన్‌లో ఉంది. వ‌కీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఈ కార‌ణంతోనే హాజరు కాలేక‌పోయింది. అయితే ఏప్రిల్ 10న తాను థియేట‌ర్‌లో వ‌కీల్ సాబ్ సినిమా చూస్తున్న పిక్స్ షేర్ చేసింది. కరోనా పాజిటివ్ వచ్చాక కూడా సినిమా థియేటర్ కు ఎలా వచ్చావు అంటూ పలువురు నెటిజన్లు ఆమెను తిట్టడం మొదలుపెట్టారు. పలువురు బహిరంగంగా విమర్శించారు కూడానూ..! ఈ విమర్శలపై నివేదా స్పందించింది.

త‌న‌కు క‌రోనా నెగెటివ్ వ‌చ్చిన తర్వాతనే థియేట‌ర్‌లో సినిమా చూసాన‌ని.. ప్ర‌మోష‌న్ టైంలో కరోనా రావ‌డం బాధ అనిపించింది. రైట్ టైమ్‌కు నెగెటివ్ వ‌చ్చిందని ఆమె వెల్లడించింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోమ‌న్నారు వైద్యులు. అయితే ప్రేక్ష‌కుల రెస్పాన్స్ ఎలా ఉందో చూసేందుకు తాను థియేట‌ర్‌కు వెళ్లానని నివేదా థామస్ చెప్పుకొచ్చింది. కోవిడ్ వ‌ల‌న ప్రేక్ష‌కుల‌ని నేరుగా క‌ల‌వ‌లేక‌పోయిన వారు పెడుతున్న పోస్ట్‌ల‌న్నింటిని చ‌దువుతున్నాన‌ని స్ప‌ష్టం చేసింది.


Next Story