విద్యార్థులకు పాఠాలు చెప్పిన నిత్యామీనన్.. వీడియో వైరల్
Nithya Menon Teach Lessons To Government School Students. ప్రముఖ దక్షిణ భారత నటి నిత్యా మీనన్ తన షూటింగ్ షెడ్యూల్‌లో విరామం
By అంజి Published on 19 Jan 2023 7:33 PM ISTప్రముఖ దక్షిణ భారత నటి నిత్యా మీనన్ తన షూటింగ్ షెడ్యూల్‌లో విరామం సమయంలో ఉపాధ్యాయురాలిగా మారారు. ఆమె తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులకు నైతిక కథలు బోధిస్తున్న వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యామీనన్.. ఓ మలయాళీ మూవీ షూటింగ్ కోసం తెలుగు రాష్ట్రానికి వచ్చింది. షూటింగ్‌లో భాగంగా కృష్ణాపురంలో నిత్యామీనన్ సందడి చేశారు.
షూట్ పూర్తి కాగానే దగ్గర్లోని ఓ స్కూల్‌కు వెళ్లారు. చిన్నారులతో సరదాగా మాట్లాడి ఇంగ్లీష్ పాఠాలు బోధించారు. దీనికి సంబంధించి వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ క్యాప్షన్‌లో నిత్యా మీనన్ ఇలా వ్రాశారు.. "కృష్ణాపురం గ్రామంలోని పాఠశాలలో అందమైన చిన్నారులతో నా న్యూయర్ డే ఇలా గడిచింది. నేను వారి కంటే ఎక్కువగా అక్కడ ఉండవలసి ఉంటుంది. గ్రామాలలో ఉండే పిల్లలు బాల్యాన్ని ఎంతో హ్యపీగా గడుపుతారు. వారూ నా చుట్టూ ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉంటాను" అని రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి సానుకూల అభిప్రాయాన్ని పొందింది. నిత్యా మీనన్ చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.