పవన్‌ హిట్‌ టైటిల్‌తో నితిన్‌ కొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌ హీరో నితిన్‌ తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇవాళ ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్‌ అయ్యింది.

By అంజి  Published on  27 Aug 2023 11:45 AM IST
Nithin, new movie,Pawan kalyan,Thammudu

పవన్‌ హిట్‌ టైటిల్‌తో నితిన్‌ కొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా? 

టాలీవుడ్‌ హీరో నితిన్‌ తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇవాళ ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్‌ అయ్యింది. ఈ కార్యక్రమానికి సినిమా టీంతో పాటు దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి సహా మరికొందరు హాజరయ్యారు. 'వకీల్‌ సాబ్‌' ఫేమ్‌ దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హిట్‌ సినిమా 'తమ్ముడు' టైటిల్‌ని.. ఈ సినిమాకు ఫిక్స్‌ చేశారు. ఈ విషయాన్ని హీరో నితిన్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు.

'కొన్ని టైటిల్స్ ఎంతో బాధ్యతను పెంచేలా వస్తాయి. ఈ సినిమా మీ అంచనాలను మించేలా ఉంటుంది. నా కొత్త సినిమా వేణు శ్రీరామ్, దిల్ రాజు గారితోనే' అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. నితిన్‌.. పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని. ఇప్పుడు పవన్‌ సినిమా టైటిల్‌తోనే సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సినిమాలో పని చేసే ఇతర నటీనటులు, టెక్నిషీయన్ల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్​.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్స్‌ అందుకున్నారు. ప్రస్తుతం నితిన్‌ చేతిలో వెంకీ కుడుములతో ఓ చిత్రం, వక్కంతం వంశీతో మరో సినిమా ఉన్నాయి. ఇవి సెట్స్​పైన ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు వేణు శ్రీరామ్​తో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ రెడీ అయ్యారు.

Next Story