క్వారంటైన్‌లో భార్య‌.. కేక్ క‌ట్ చేసిన హీరో నితిన్‌.. వీడియో వైర‌ల్‌

Nithin's beautiful wish for his quarantined wife.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంబిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2022 5:37 AM GMT
క్వారంటైన్‌లో భార్య‌.. కేక్ క‌ట్ చేసిన హీరో నితిన్‌.. వీడియో వైర‌ల్‌

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంబిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. సెకండ్ వేవ్ తో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది సెల‌బ్రెటీలకు ఈ వైర‌స్ సోకుతోంది. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇలా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. యంగ్ హీరో నితిన్ స‌తీమ‌ణికి కూడా కరోనా సోకింది. దీంతో ప్ర‌స్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంది.

అయితే.. ఈ రోజు ఆమె పుట్టిన రోజు కావ‌డంతో క‌రోనాకి హ‌ద్దులు ఉండొచ్చేమో.. కానీ ప్రేమ‌కు ఎలాంటి స‌రిహ‌ద్దులు అడ్డంకులు ఉండ‌వ‌ని హీరో నితిన్‌ ట్వీట్ చేశాడు. జీవితంలో తొలిసారి త‌న భార్య‌ నెగెటివ్ కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు. త‌న భార్య పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఎలా చేశాడో తెలియ‌జేస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.

త‌న భార్య పుట్టిన రోజు సంద‌ర్భంగా సెల‌బ్రెష‌న్స్ చేయాల‌ని నితిన్ బావించాడు. ఆమెకి క‌రోనా రావ‌డంతో ఇంట్లో పై రూమ్‌లో క్వారంటైన్‌లో ఉంది. త‌న భార్య‌ కిటిలోంచి కింద‌కు చూస్తుండ‌గా.. కింద గార్డెన్ ఏరియాలో నితిన్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కేట్ క‌ట్ చేసి విషెష్ తెలియ‌జేశాడు. కింద నుంచే త‌న భార్య‌కు కేక్ చూపించి తిను అన్న‌ట్లు చెప్పాడు. ఇలా దూరంగా ఉండి భార్య‌ పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. 'క‌రోనాకు హ‌ద్దులుంటాయి.. మ‌న ప్రేమ‌కు హ‌ద్దులుండ‌వు' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it