నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ 30 కోట్లుగా అంచనా వేశారు.
వెంకీ కుడుముల-నితిన్ కాంబినేషన్ లో వచ్చిన భీష్మ పూర్తి రన్ లో ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. సినిమాకు మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం రాబిన్ హుడ్ భీష్మ నంబర్స్ తో సరిపెట్టుకోవాల్సి ఉంది. ఇంతకు ముందు నితిన్ కు మంచి హిట్స్ పడి ఉంటే రాబిన్ హుడ్ కు బిజినెస్ మరింత బాగున్నేమో. ఇక రాబిన్ హుడ్ విడుదల సమయానికి మ్యాడ్ స్క్వేర్ కూడా థియేటర్లలో విడుదలకాబోతోంది.
ఈ సినిమాతో నితిన్ కేవలం హిట్ కొట్టడమే కాకుండా 100 కోట్ల గ్రాస్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సాధించి హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నాడు. వేసవి సీజన్ కూడా రాబిన్ హుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించడానికి సహాయపడుతుంది.