రేపే 'మాచర్ల నియోజకవర్గం' నుంచి మరో సాంగ్‌ రిలీజ్‌

Nithin macherla niyojakavargam third single will be releasing on july 23rd. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో టాలీవుడ్‌ హీరో నితిన్‌ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గతేడాది ఏకంగా 3 సినిమాలతో

By అంజి  Published on  22 July 2022 9:47 AM IST
రేపే మాచర్ల నియోజకవర్గం నుంచి మరో సాంగ్‌ రిలీజ్‌

హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో టాలీవుడ్‌ హీరో నితిన్‌ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గతేడాది ఏకంగా 3 సినిమాలతో సందడి చేశాడు. 'రంగ్‌దే' మూవీ హిట్‌ కొట్టగా.. 'చెక్‌' మూవీ ఫ్లాప్‌గా మిగిలింది. ఇక 'మ్యాస్ట్రో' ఓటీటీలో విడుద‌లై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం నితిన్ న‌టించిన‌ 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నితిన్‌ రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ సారి నితిన్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రానున్నాడు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌ం అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ మూవీ ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది.

ఈ క్ర‌మంలో ప్రమోషన్స్‌ షురూ చేసింది. తాజాగా చిత్ర‌యూనిట్‌ మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించింది. ఈ సినిమాలోని 'అదిరిందే' అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను జూలై 23న (రేపు) విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన 'రా రా రెడ్డి' సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్‌ ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Next Story