ఆకట్టుకుంటున్న 'మాచర్లనియోజకవర్గం' ఫస్ట్‌లుక్
Nithiin First look from Macherla Niyojakavargam Release.టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం
By తోట వంశీ కుమార్ Published on 26 March 2022 5:35 AM GMT
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కేథరిన్ థెరిసా, కృతిశెట్టి నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా.. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. గుంటూరు జిల్లాకు కలెక్టర్ ఎన్ సిద్థార్థ్ రెడ్డి గా కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో నితిన్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నితిన్ వెనకాల పులి గెటప్‌లతో విలన్లు తన మీద కత్తి దూయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఏదో పోరాట సన్నివేశానికి సంబంధించినదిగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.