నిఖిల్‌ 'స్పై' మూవీ పోస్ట్‌ పోన్‌పై క్లారిటీ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌.. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీస్తూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. నిఖిల్‌ సినిమా వస్తుందంటే..

By అంజి  Published on  13 Jun 2023 11:51 AM IST
Nikhil, Spy Movie, Tollywood

నిఖిల్‌ 'స్పై' మూవీ పోస్ట్‌ పోన్‌పై క్లారిటీ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌.. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీస్తూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. నిఖిల్‌ సినిమా వస్తుందంటే.. మినిమం హిట్‌ అవుతుందనే ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు. 'కార్తికేయ-2' సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టాడు. ఈ స్క్రిప్ట్‌ సెలక్షన్‌లో కూడా తనదైన శైలిలో ముందుకెళ్తున్నాడు. ఆ మధ్య రిలీజైన '18 పేజీస్‌' సినిమా కాస్త నిరాశపర్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ నిఖిల్‌ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ప్రస్తుతం నిఖల్‌ మూడు సినిమాలో చేస్తున్నాడు. అందులో 'స్పై' సినిమా ఒకటి. ప్రముఖ ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇదిలా ఉంటే గత నాలుగైదు రోజుల నుంచి ఈ సినిమా పోస్ట్‌ పోన్‌ కానుందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రయూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా జూన్‌ 28న ప్రీమియర్‌ కానున్నట్లు యూఎస్‌ డిస్ట్రిబ్యూటర్‌ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్‌ తెలిపింది. మొత్తంగా 450కుపైగా లోకేషన్లలో సినిమా రిలీజ్‌ కానుంది. వచ్చే సోమవారం నుండి బుకింగ్స్‌ కూడా ప్రారంభం కానున్నట్లు తెలిపింది. దీంతో 'స్పై' సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈడీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్ తేజ్ ఉప్పల‌పాటిలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్‌, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story