జగిత్యాలలో నాపై కోడిగుడ్లు విసిరారు : చిరంజీవి
Nijam with Smita First Episode Promo out now. నిజం విత్ స్మిత అనే పేరుతో సింగర్ స్మిత
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2023 2:08 PM ISTఓటీటీల పుణ్యమా అని టాక్ షోలకు విపరీతమైన ఆదరణ వస్తుంది. ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా 'అన్ స్టాపబుల్' షో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఆహా బాటలోనే సోనీ లీవ్ కూడా ఓ కొత్త టాక్ షో ను సిద్దం చేసింది. "నిజం విత్ స్మిత" అనే పేరుతో సింగర్ స్మిత ఈ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవరిహస్తోంది.
సెలబ్రెటీల వ్యక్తిగత, కెరీర్ విషయాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ షో ఒక వేదిక కానుంది. సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. తొలి ఎపిసోడ్ ఫిబ్రవరి 10 నుంచి సోనీలివ్‌లో స్టీమ్రింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రోమో ప్రారంభంలో.. చిరంజీవి షోలోకి ఆహ్వానించిన స్మిత తన కాలేజ్ డేస్ ని..మీ ఫస్ట్ క్రష్ ఏంటి అని అడిగింది. ఇందుకు చిరు సమాధానం చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో వెళ్లిపోయారు. స్టార్ డమ్‌ను సొంతం చేసుకునే క్రమంలో మీకు ఎదురైన అవమానాలు ఏంటీ..? అని స్మిత మరో ప్రశ్నను అడిగింది. గతంలో తాను జగిత్యాలకు వెళ్లగా అక్కడ అభిమానులు తనపై పూలవర్షం కురిపించారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్లగానే కొందరు కోడిగుడ్లు కూడా విసిరారు అని చిరంజీవి సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగింది అనేది తెలియాలటే ఫిబ్రవరి 10న తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.