'పుష్ప-2' నుంచి కొత్త పోస్టర్‌ విడుదల.. త్వరలోనే ట్రైలర్‌

సరిగ్గా మరో నెల రోజుల్లో 'పుష్ప-2' సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప2పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

By అంజి  Published on  5 Nov 2024 1:30 PM IST
Pushpa-2, Tollywood, Allu Arjun, Rashmika

'పుష్ప-2' నుంచి కొత్త పోస్టర్‌ విడుదల.. త్వరలోనే ట్రైలర్‌

సరిగ్గా మరో నెల రోజుల్లో 'పుష్ప-2' సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప2పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. కొత్త కొత్త అప్‌డేట్‌లు ఇస్తూ అభిమానులు, సినీ లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది.

తాజాగా అల్లు అర్జున్‌, ఫహాద్‌ ఫాజిల్‌ ఎదురుపడిన పోస్టర్‌ను సినిమా యూనిట్‌ రిలీజ్‌ చేసింది. 'బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రాబోతోంది. సిద్ధంగా ఉండండి' అని పేర్కొంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తామని తెలిపింది. 'పుష్ప-2' సినిమా డిసెంబర్‌ 5వ తేదీన విడుదల కానుంది. కాగా ఇటీవల దీపావళి పండుగను పురస్కరించుకొని చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అల్లుఅర్జున్‌, రష్మికలమ రొమాంటిక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వంటింట్లో శ్రీవల్లితో పుష్ప రొమాన్స్‌ చేస్తున్న క్యూట్ ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

'పుష్ప-2' ది రూల్‌ చిత్రాన్ని ఏకంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేసేందకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఓవర్‌సీస్‌లో 5వేల స్క్రీన్స్‌, భారత్‌లో 6500 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Next Story