చంద్రముఖి-2 ఓటీటీలోకి వచ్చేస్తోంది
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'చంద్రముఖి-2'.
By Medi Samrat Published on 21 Oct 2023 4:48 PM ISTరాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'చంద్రముఖి-2'. ఈ సినిమా మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం.. థ్రిల్లింగ్ అంశాలు కూడా లేకపోవడంతో సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ పెదవి విరిచారు. డిస్ట్రిబ్యూటర్లకు, థియటర్ ఓనర్లకు ఈ సినిమా ఊహించని నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తయ్యి చాలా రోజులే అవుతోంది. దీంతో ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది.
సెప్టెంబరు 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 26వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ అధికారిక పోస్టర్‌ను పంచుకుంది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘చంద్రముఖి2’ స్ట్రీమింగ్ కానుంది. వెండితెరపై ఎలాగూ అలరించలేకపోయిన ఈ సినిమా.. కనీసం బుల్లితెర మీద అయినా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.