'NBK107' క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పండగే.!
Nbk107 Title Logo Launch at Konda Reddy Burju this Friday at 8 15 PM. నందమూరి బాలకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్ 'ఎన్‌బీకె 107' హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది.
By అంజి
నందమూరి బాలకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్ 'ఎన్‌బీకె 107' హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని యదార్థ సంఘటనల ఆధారంగా కథను రాశారు. 'క్రాక్' మూవీ హిట్‌తో మంచి ఊపు మీదున్నారు గోపిచంద్ మలినేని. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ పాత్ర ఎక్కువగా మాస్‌ని తలపించేలా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన బాలయ్య ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లు పవర్-ప్యాక్డ్‌తో ఊర్రూతలుగించాయి.
అయితే తాజాగా చిత్రయూనిట్ మరో క్రేజ్ అప్‌డేట్‌ను అందించింది. 'NBK107' టైటిల్ లోగోను ఈ నెల 21న కర్నూలులో కొండా రెడ్డి బురుజు దగ్గర రాత్రి 8:15 గంటలకు ఆవిష్కరించనున్నారు. క్రేజీ అప్‌డేట్ గురించి చెబుతూ విడుదల చేసిన పోస్టర్‌లో కొండా రెడ్డి బురుజు ముందు బాలకృష్ణ కుర్చీలో కూర్చున్నారు. ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. బాలకృష్ణ ముందు భారీగా జనం నిలబడడం కూడా కనిపిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ లీడర్‌గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
The MASS euphoria intensifies 🔥#NBK107 title launch on the iconic Konda Reddy Buruju, Kurnool on October 21st at 8:15 PM ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2022
NATASIMHAM #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/Qe6zPYrVgp