అభిమానుల ప్రేమ ఓట్లుగా ఎందుకు మార‌లేదు..? ప‌వ‌న్‌కు బాల‌య్య ప్ర‌శ్న‌

NBK X PSPK power teaser in unstoppable out now.నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హోస్టుగా అల‌రిస్తున్న టాక్ షో అన్‏స్టాపబుల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2023 8:39 AM IST
అభిమానుల ప్రేమ ఓట్లుగా ఎందుకు మార‌లేదు..?  ప‌వ‌న్‌కు బాల‌య్య ప్ర‌శ్న‌

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హోస్టుగా అల‌రిస్తున్న టాక్ షో అన్‏స్టాపబుల్. సీజ‌న్ 2లో భాగంగా ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు వ‌చ్చారు. ఇటీవ‌ల ఈ టాక్ షో కు సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఆహా ఓటీటీలో త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం అటు నంద‌మూరి, ఇటు మెగా అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ప‌వ‌న్‌ను బాల‌య్య ఎలాంటి ప్ర‌శ్న‌లు అడ‌గ‌నున్నారు..? వాటికి ప‌వ‌న్ ఏ విధ‌మైన స‌మాదానాలు చెప్ప‌నున్నారు అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

పవ‌న్ ఎపిసోడ్‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచేందుకు ఆహా బృందం కొత్త టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఈ వీడియో ప్రారంభంలో బాల‌కృష్ణ త‌న‌ను బాల అని పిల‌వాల‌ని కోర‌గా మ‌రోసారి ఓడిపోవ‌డానికి సిద్ధం కానీ అలా మాత్రం పిల‌వ‌ను అంటూ ప‌వ‌న్ న‌వ్వులు చిందించారు. ఇందుకు బాల‌య్య.. ఈ పాలిటిక్స్‌యే వ‌ద్దు అన్నారు. ఆ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి నుంచి నువ్వు నేర్చుకున్న‌వి ఏమిటీ..? వ‌ద్ద‌నుకున్న‌వి ఏమిటీ..? అంటూ బాల‌య్య ప్ర‌శ్నించారు.

అలాగే రాజ‌కీయాల గురించి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు బాలయ్య‌. అభిమానుల అభిమానం ఎన్నికల్లో ఓట్లుగా ఎందుకు మార‌లేదని ప‌వ‌న్‌ను బాల‌య్య అడిగారు. మొత్తానికి సినీ, రాజ‌కీయాల స‌మ్మేళ‌నంతో ఉన్న ఈ మొత్తం ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంద‌నే విష‌యాన్ని మాత్రం ఆహా ఇంకా వెల్ల‌డించ‌లేదు. టీజ‌ర్‌తో మాత్రం అంచ‌నాల‌ను రెట్టింపు చేశారు.

Next Story