'ఎన్‌బీకే 108' అప్‌డేట్ అదిరింది.. బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే

NBK 108 Announcement video is out. నందమూరి బాలకృష్ణ అనౌన్స్‌ చేసిన లేటెస్ట్‌ ప్రాజెక్టు 'ఎన్‌బీకే 108'. యంగ్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమాకు

By అంజి  Published on  11 Aug 2022 8:16 PM IST
ఎన్‌బీకే 108 అప్‌డేట్ అదిరింది.. బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే

నందమూరి బాలకృష్ణ అనౌన్స్‌ చేసిన లేటెస్ట్‌ ప్రాజెక్టు 'ఎన్‌బీకే 108'. యంగ్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్‌ అదిరిపోయే అప్‌డేట్‌ ప్రకటించారు. సంగీత దర్శకుడు థ‌మ‌న్ కంపోజ్ చేసిన బీజీఎంతో 'ఎన్‌బీకే 108'ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుందని ఇవాళ స్పెషల్‌ వీడియో లాంఛ్‌లో మేకర్స్‌ తెలిపారు.

హీరో బాలకృష్ణకు సూట్‌ అయ్యే విధంగా.. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఓ సరికొత్త స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లు తాజా వీడియోతో అర్థం అవుతోంది. 'అఖండ' మూవీకి అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించిన ఎస్‌ ఎస్‌ థమన.. ఈ మూవీకి మరోసారి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో చేస్తున్న‌ ఎన్‌బీకే 107 షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీలో శృతిహాస‌న్‌ హీరోయిన్‌ రోల్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రంలో 'పెళ్లి సందD' ఫేం శ్రీలీల బాల‌కృష్ణ కూతురిగా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.


Next Story