NBK107 షూటింగ్ వీడియో వైరల్
NBK 107 Video Leaked goes viral.గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య.
By తోట వంశీ కుమార్ Published on 27 Sept 2022 1:29 PM IST
గతేడాది విడుదలైన 'అఖండ' చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పుల్ జోష్‌లో ఉన్నారు బాలకృష్ణ. అదే జోష్‌లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ టర్కీలో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక బాలయ్య టర్కీలో ఉన్నాడని తెలుసుకున్న కొందరు అభిమానులు షూటింగ్ స్పాట్‌కు వెళ్లి షూటింగ్‌ను చూస్తూ సెల్ఫీలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా.. ఓ ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో బాలయ్యకు రౌడీలకు మధ్య ఫైటింగ్ జరుగుతుంది. బాలయ్య.. ఓ రౌడీ చేయి నరికి అటు ఇటు తిరుగుతున్నాడు. బాలయ్యను చూస్తూ రౌడీలంతా అటు భయంతో ఇటు కోపంతో రగిలిపోతున్నారు. బ్లాక్ షర్టులో బాలయ్య లుక్స్ అదుర్స్ అనేలా ఉంది. 30 సెకన్ల నిడివి ఉన్న వీడియో చాలా బాగుందని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
From the set's of #NBK107 Turkey Action Schedule 🔥🔥🔥#GodOfMassesNBK @megopichand @shrutihaasan #JaiBalayya @NBK_Unofficial @Mokshagna_Offl @BalayyaUvasena @ALINTR9999 @NtrMaruthi9999 @Mahisiri161 @venutarak14 pic.twitter.com/8FZn7ivutf
— NTR Fans Anantapur official (@Sravant68455447) September 26, 2022
కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.