ఆ పెళ్లి వెనుక ఉన్న సీక్రెట్స్ ను చూపిస్తారా.?

దక్షిణాది స్టార్ నటి నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది

By Medi Samrat  Published on  8 Oct 2024 9:55 PM IST
ఆ పెళ్లి వెనుక ఉన్న సీక్రెట్స్ ను చూపిస్తారా.?

దక్షిణాది స్టార్ నటి నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు వీరిద్దరూ చాలా కాలం సహజీవనం చేశారు. వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి సంబంధించిన చిత్రాలు మాత్రమే బయటకు వచ్చింది. అప్పట్లో నయనతార తన పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీని ఓటీటీకి అమ్మేసిందంటూ వార్తలు కూడా వచ్చాయి.

అయితే చాలా గ్యాప్ తర్వాత నయనతార పెళ్లి డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీకి 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరు కూడా పెట్టారు. ఈ డాక్యుమెంటరీ రన్‌టైమ్ 1 గంట 21 నిమిషాలు. ఇది దీపావళి పండుగకు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత కూడా నయనతార చాలా సినిమాలతో నటిస్తూ ఉంది. అయితే ఈ జంట సరోగసీ విధానం ద్వారా కవలలకు జన్మనిచ్చింది, అది అప్పట్లో వివాదాస్పదమైంది.

ప్రస్తుతం ఈ జంట తమ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నయనతార ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఉండగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి లు 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలో చేస్తున్నారు.

Next Story