వివాహ బంధంలోకి అడుగుపెట్టిన న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్

Nayanthara and Vignesh Shivan's wedding Shah Rukh Khan Rajinikanth more celebrities attended.కోలీవుడ్ ప్రేమ‌జంట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 1:31 PM IST
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన  న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్

కోలీవుడ్ ప్రేమ‌జంట న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్ లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. త‌మిళ‌నాడు మ‌హాబ‌లిపురంలోని షెరిట‌న్ హోట‌ల్‌లో కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. వీరి వివాహావేడుకలో ప‌లువురు సినీ తార‌లు సంద‌డి చేశారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్‌, దర్శకుడు అట్లీ, రాధికా శరత్‌ కుమార్‌, విజయ్‌ సేతుపతి, కార్తి.. ఇలా ప‌లువురు హాజ‌రై నూత‌న జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

కాగా పెళ్లికి కొద్ది క్షణాల ముందు విఘ్నేశ్ శివన్‌ నయన్‌పై ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. తను వధువుగా ముస్తాబై వివాహ వేదికపై నడుచుకుంటూ వస్తుంటే చూడాలని ఎంతో ఆతృతుగా ఎదురు చూస్తున్నానంటూ కాబోయో భార్య గురించి ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు విఘ్నేశ్‌. అంతేకాదు ఈ సందర్భంగా తన ఆనందాన్ని, ప్రేమను నయన్‌కు అంకితం ఇస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను మ‌ధ్యాహ్నాం విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు త‌మ జీవితాల్లో ప్ర‌త్యేక‌మైన ఈ రోజుని పుర‌స్క‌రించుకుని త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌మందితో పాటు 1800 మంది చిన్నారుల‌కు భోజ‌నం అంద‌జేయాల‌ని ఈ జంట నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది.


Next Story