Video: పేదలకు సాయం చేసిన నయనతార దంపతులు

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మంచి మనసు చాటుకున్నారు. ఇళ్లు లేక రోడ్లపై నివసిస్తున్న నిరుపేదలకు తన వంతు

By అంజి  Published on  9 April 2023 2:00 PM IST
Nayanthara, Vignesh Shivan, Kollywood, Telugu news

Video: పేదలకు సాయం చేసిన నయనతార దంపతులు

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మంచి మనసు చాటుకున్నారు. ఇళ్లు లేక రోడ్లపై నివసిస్తున్న నిరుపేదలకు తన వంతు సాయం చేశారు. నయనతార, విఘ్నేష్ శివన్ ఇటీవల వర్షపు రాత్రి చెన్నై వీధుల్లో నిరాశ్రయుల పట్ల తమ నిజమైన శ్రద్ధ చూపించి నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు. ఈ జంట నిరాశ్రయులైన వారికి అవసరమైన వస్తువులను నిశ్శబ్దంగా పంపిణీ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వారి మంచి పనిని ప్రశంసిస్తున్నారు.

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతోన్న విషయం తెలిసిందే. దీంతో జీవనోపాధి లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే నయనతార తన భర్తతో కలిసి శుక్రవారం రాత్రి నిరాశ్రయులకు భోజనం అందించారు. చెన్నైలోని మెయిన్‌రోడ్ల పక్కన ఉంటున్న వారికి ఫుడ్‌ పార్శిళ్లను అందించారు. గతంలోనూ నయనతార పేదలకు సాయం చేసిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి నెలలో ఆమె పలువురు పేదలకు గిఫ్ట్‌ బాక్సులు అందించి ప్రశంసలు అందుకున్నారు.

జూన్ 2022లో చెన్నైలోని మహాబలిపురంలో జరిగిన గ్రాండ్ వేడుకలో నయనతార మరియు విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్నారు. తర్వాత, అదే సంవత్సరం అక్టోబర్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. 0ప్రస్తుతం నయనతార షారుఖ్‌తో కలిసి ‘జవాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా బడ్జెట్ చిత్రం 2023 చివరి నాటికి విడుదల కానుంది. తాజాగా ఆమె చేయనున్న 75వ సినిమా వివరాలు వెల్లడయ్యాయి. నిలేశ్‌ కృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు.

Next Story