విల‌క్ష‌ణ న‌టుడి ఇంట వివాదం.. భార్య‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన త‌ల్లి

Nawazuddin Siddiqui's mother files FIR against his wife Aaliya over property dispute. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి మెహ్రునిసా సిద్ధిఖీ.. ఆయ‌న‌ భార్య ఆలియాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు

By M.S.R
Published on : 23 Jan 2023 1:13 PM

విల‌క్ష‌ణ న‌టుడి ఇంట వివాదం.. భార్య‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన త‌ల్లి

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి మెహ్రునిసా సిద్ధిఖీ.. ఆయ‌న‌ భార్య ఆలియాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వెర్సోవా పోలీసులు ఆమెను విచారణ కోసం పిలిచారు. నవాజుద్దీన్ తల్లితో ఆలియా వాగ్వాదానికి దిగినట్లు వెర్సోవా పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాజుద్దీన్‌ తల్లికి ఆలియా అలియాస్‌ జైనాబ్‌ల మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 452, 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు.

నవాజుద్దీన్ రెండో భార్య జైనాబ్. నవాజుద్దీన్ దశాబ్దం క్రితం ఆలియా అకా అంజనా కిషోర్ పాండే అకా జైనాబ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు యాని సిద్ధిఖీ, కుమార్తె షోరా సిద్ధిఖీ ఉన్నారు. 2020లో ఆలియా విడాకులు కోరుతూ నవాజుద్దీన్‌కి లీగల్ నోటీసు పంపింది. విడిపోవడానికి తన నిర్ణయం వెనుక కారణాన్ని కూడా ఆమె చెప్పింది. తాను గృహ హింసకు గురయ్యానని, నవాజుద్దీన్ సోదరుడు షమస్ సిద్ధిఖీ తనను కొట్టాడని ఆమె ఆరోపించింది.

2021లో ఆలియా నవాజుద్దీన్‌తో విడాకులు తీసుకోవాలనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇంతకు ముందు తన భర్త నన్ను, మా పిల్లలను సరిగా పట్టించుకునేవాడు కాదని.. ఇప్పుడు నన్ను చాలా మంచిగా చూసుకుంటూ ఉన్నాడని ఆలియా తెలిపింది. మా మధ్య ఉన్న సమస్యలన్నింటినీ తొలగించేందుకు నేను, నవాజ్ ఇద్దరూ కలిసి ప్రయత్నిస్తామని ఇంతకు ముందు మీడియాతో చెప్పుకొచ్చింది. నవాజుద్దీన్ కూడా నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడనని, అయితే సమస్యలను తీర్చుకోడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఉన్నామని అన్నారు.


Next Story