మ‌రోమారు అస్వస్థతకు గురైన సీనియ‌ర్ హీరో కార్తీక్‌

Navarasa Nayagan Karthik hospitalized again. తాజాగా మ‌రోమారు కార్తీక్ అనారోగ్యం పాల‌య్యారు. అధిక ర‌క్త‌పోటు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధ‌ప‌డుతున్న‌ ఆయన్ని అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

By Medi Samrat
Published on : 11 April 2021 8:37 AM IST

Hero karthik hodpitalized

కార్తీక్.. ఈయన పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకులకు 'సీతాకోకచిలుక', 'అభినందన,'అన్వేషణ' 'మగరాయుడు' వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నారనుకోండి. పలు తెలుగు, తమిళ సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటిస్తూ ఉన్నారు కార్తీక్. అయితే.. ఇప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

గ‌త నెల‌లో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న‌ ఆయన.. అనారోగ్యం పాలయ్యారు. దాంతో కార్తీక్‌ను కుటుంబ స‌భ్యులు హస్పిటల్‌లో చేర్పించగా కోలుకున్నారు. అయితే.. తాజాగా మ‌రోమారు కార్తీక్ అనారోగ్యం పాల‌య్యారు. అధిక ర‌క్త‌పోటు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధ‌ప‌డుతున్న‌ ఆయన్ని అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదిలావుంటే.. కార్తీక్ గ‌తంలో 'మనిద ఉరిమై కట్చి' అనే పార్టీని కూడా స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసాడు. ఈ ఎన్నికల్లో కార్తీక్‌ పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించింది. ఇక 'మనిద ఉరిమై కట్చి' అంటే మానవ హక్కుల పార్టీ అనే అర్ధం కూడా ఉంది. త‌మిళ‌నాట అభిమానులు కార్తీక్‌ను 'న‌వ‌ర‌న నాయ‌గ‌న్' అని పిలుస్తారు.


Next Story