ఓజీ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్యతో పాటు ఫిలిం ఛాంబర్, కౌన్సిల్ సభ్యులు బాధ్యత వహించాలన్నారు. ఎవరైతే ఈ టికెట్ ధరల పెంపు వెనుక ఉన్నారో వారందరూ ఈ తప్పులో భాగమని, ఓజీ టికెట్ ధరల పెంపు విషయంలో ఈ ప్రభుత్వాలు కళ్లు మూసుకొని అనుమతులు ఇచ్చేస్తున్నాయన్నారు. ఇలా ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ రేట్లు పెంచితే పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని గుర్తుచేశారు. ఇలాగే కొనసాగితే ప్రేక్షకులు ఓటీటీ, పైరసీలకు అలవాటు పడుతారన్నారు.
ఓజీ సినిమాకు సంబంధించి ఏపీలో ప్రీమియర్ షో ధరలు రూ .1000 రూపాయలు, తెలంగాణలో రూ .800 రూపాయలు ఉండడంతో సామాన్యులు, సినిమా ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.