'నార‌ప్ప' న‌టుడు కార్తీక్ ర‌త్నం ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైర‌ల్‌

Narappa Fame Karthik Rathnam got Engaged.నార‌ప్ప చిత్రంతో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ కార్తీక్ ర‌త్నం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2022 7:47 AM GMT
నార‌ప్ప న‌టుడు కార్తీక్ ర‌త్నం ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైర‌ల్‌

'నార‌ప్ప' చిత్రంతో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ కార్తీక్ ర‌త్నం త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కానున్నాడు. శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ హోట‌ల్‌లో అత‌డి నిశ్చితార్థ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఇరు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌కు హీరో న‌వీన్ చంద్ర హాజ‌ర‌య్యాడు. కాబోయే వ‌ధూవ‌రుల‌కు అభినంద‌న‌లు తెలిపాడు. కార్తీక ర‌త్నం చేసుకునే అమ్మాయి గురించి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఆమెది హైద‌రాబాద్ అని స‌మాచారం. కాగా.. కార్తీక ర‌త్నం ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు ఈ యువ న‌టుడికి అభినంద‌న‌లు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.


చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాల‌నుకున్న కార్తీక్ రత్నం సినిమాల‌పై ఉన్న మ‌క్కువ‌తో ఆ కోర్సును మ‌ధ్య‌లోనే వ‌దిలివేసి థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభిచాడు. వెంక‌ట్ మ‌హా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో జోసెఫ్ పాత్ర అనే లీడ్ పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర అయ్యాడు. ఆ త‌రువాత 'నారప్ప' చిత్రంలో వెంక‌టేష్ పెద్ద కొడుకు ముని క‌న్న‌గా న‌టించి ఆక‌ట్టుకున్నాడు. అయితే.. ఆ త‌రువాత న‌టించిన 'అర్ధశతాబ్దం' సినిమా మిశ్రమ ఫ‌లితాన్ని ఇచ్చింది. 'రౌడిబాయ్స్' చిత్రంలో ఇంజ‌నీరింగ్ స్టూడెంట్‌గా న‌టించాడు.


Next Story
Share it