'అంటే సుందరానికీ' కోసం సమ్మర్ సీజన్ ను బ్లాక్ చేసిన నాని.. ఏడు రిలీజ్‌ డేట్స్‌

Nani blocks 7 release dates for Ante Sundaraniki.'శ్యామ్ సింగ‌రాయ్' చిత్రంతో నేచుర‌ల్ స్టార్ నాని భారీ హిట్ అందుకున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 4:09 AM GMT
అంటే సుందరానికీ కోసం సమ్మర్ సీజన్ ను బ్లాక్ చేసిన నాని.. ఏడు రిలీజ్‌ డేట్స్‌

'శ్యామ్ సింగ‌రాయ్' చిత్రంతో నేచుర‌ల్ స్టార్ నాని భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా ఆయ‌న 'అంటే సుందరానికీ' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న 'రాజారాణి' ఫేమ్‌ నజ్రియా నజీమ్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి కే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం సినిమాలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలు రెండేసి విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించగా.. నాని మాత్రం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్ల‌ను ప్ర‌క‌టించాడు. "మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా.. ఫుల్ ఆవకాయ సీజన్ ని బ్లాక్ చేసాం.. మెల్లగా డిసైడ్ చేద్దాం అంటూ ఏప్రిల్‌ 22, ఏప్రిల్‌ 29, మే 6, మే 20, మే 27, జూన్‌ 3, జూన్‌ 10.. వీటిలో ఏదో ఒక తేదీలో థియేటర్లలో అడుగుపెడతాం అంటూ ఓ పోస్ట‌ర్‌ను వ‌దిలాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. మ‌రీ నాని ఏడు తేదీల్లో ఏ రోజున 'అంటే సుందరానికీ' చిత్రాన్ని విడుద‌ల చేస్తాడో చూడాలి మ‌రీ.

Next Story